ఆగస్టు 5 నాటికి చంద్రుడి దగ్గరకు చంద్రయాన్‌…

చంద్రయాన్‌ ప్రయోగంలో మరో అడుగు పడిరది. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌ మాన్యువర్‌)ను ఇస్రో పెంచింది. ప్రస్తుతం చంద్రయాన్‌`3 ఉపగ్రహం 51400 కివిూ లీ 228 కిలోవిూటర్ల దూరంలో భూ కక్ష్యలో తిరుగుతోంది. వచ్చే నెల 5న చంద్రుడి కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 14న శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌ నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇస్రో చంద్రయాన్‌ ప్రయాణాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తోంది. దశలవారిగా క్రమక్రమంగా ఇంజిన్‌ను మండిరచి కక్ష్యను పెంచుకుంటూ వెళ్తోంది.చంద్రయాన్‌ భూకక్షలో ప్రవేశించిన తరువాత ఇస్రో మూడుసార్లు కక్ష్యను పెంచింది. తాజాగా గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్యను పెంచింది. ఈ నెల 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మరోసారి ఇంజిన్‌ను మండిరచి కక్ష్యను పెంచనుంది. వచ్చే నెల 5 నాటికి చంద్రుడి కక్షలోకి చేరుకోనుంది. ఆగస్టు 23, 24 వరకు చంద్రుడిపై ల్యాండ్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రయాన్‌ 3ని బాహుబలి రాకెట్‌గా చెప్పిన ఇస్రో ఆ తరవాత దానికి లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ 3 గా పేరు పెట్టింది. దీని బరువు 642 టన్నులు. బరువు 3,921కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోవిూటర్ల వరకూ ప్రయాణిస్తుంది. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. ల్యాండర్‌, రోవర్‌ మాడ్యూల్‌ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి సౌత్‌ పోల్‌కి సవిూపంలో ల్యాండ్‌ అవ్వనుంది. ప్రపల్షన్‌ మాడ్యూల్‌ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్‌ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్‌ విడిపోతుంది. లాంఛ్‌ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్‌ దిగుతుంది.చైనా, రష్యాలు జంబో రాకెట్లను ఉపయోగించి చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపించాయి. చైనా, అమెరికా దాదాపు రూ.1000కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా.. అయితే ఇస్రో రూ.500కోట్ల నుంచి రూ.600 కోట్లతోనే ప్రయోగం చేపడుతోంది. చంద్రుడి కక్ష్య వరకు వెళ్లే శక్తివంతమైన రాకెట్‌ సైతం ఇస్రో వద్ద లేకపోయినా క్లిష్టమైన ప్రక్రియలో ప్రయోగం చేపట్టింది. భారత్‌ సత్తా ప్రపంచమంతా చాటేలా ప్రయోగం చేసింది.ఇటలీలోని మన్సియానోకు చెందిన వర్చువల్‌ టెలిస్కోప్‌ ప్రాజెక్ట్‌ అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న చంద్రయాన్‌`3ను చిత్రీకరించింది. అందులో చంద్రయాన్‌`3 ఓ చుక్కలా వేగంగా ప్రయాణిస్తోంది. భూమికి 341 కిలోవిూటర్ల ఎత్తులో చంద్రయాన్‌`3 కదలికలను వర్చువల్‌ టెలిస్కోప్‌ గుర్తించింది. ఈ వీడియో సోషల్‌ విూడియాలో ట్రెండిరగ్‌ అయ్యింది. ఇటలీకి చెందిన ఈ వర్చువల్‌ టెలిస్కోప్‌ ఖగోళానికి చెందిన పలు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించి సమాచారం ఇస్తూ ఉంటుంది. చంద్రయాన్‌`3 విషయంలోను ఈ టెలిస్కోప్‌ తన పనితనం, నైపుణ్యం ప్రదర్శించింది.

Leave A Reply

Your email address will not be published.