ఆంధ్ర రంజీ జట్టుకు మచ్చా దత్తా రెడ్డి ఎంపిక

  • చిన్న వయసులో రంజీ జట్టుకి ఎంపికై చరిత్ర సృష్టించిన మచ్చా దత్తారెడ్డి
  • జర్నలిస్టు బిడ్డ ఆంధ్ర రంజి జట్టుకు
  • అనంత జిల్లా క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయం

అనంతపురం జిల్లాకు చెందిన యువ క్రికెటర్ దత్తారెడ్డి ఆంధ్ర రంజి జట్టుకి ఎంపికయ్యారు ఆంధ్ర రంజి జట్టుకి ఎంపికైనట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఆర్ గోపీనాథ్ రెడ్డి అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి సమాచారం అందజేశారు. మచ్చా దత్త రెడ్డి చిన్నప్పటి నుంచి క్రికెట్లో రాణిస్తున్నారు జర్నలిస్టు ఉద్యమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కుమారుడు దత్త రెడ్డి, జర్నలిస్టు కుటుంబం నుంచి ఆంధ్ర రంజి జట్టుకి ఎంపికైన మొట్టమొదటి క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి రాయలసీమ క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో 19 సంవత్సరాల 4 నెలలకు ఆంధ్ర రంజి టీంకి ఎంపీక కావడం ఒక చరిత్ర ఇప్పటివరకు రాయలసీమ నుంచి ఇంత చిన్న వయసులో ఆంధ్ర రంజి జట్టుకి ఎవరు ఎంపిక కాలేదు.

అనంతపురం జిల్లాకు చెందిన మచ్చా దత్తారెడ్డి అతి చిన్న వయసులో ఆంధ్ర రంజి జట్టుకి ఎంపికైన తొలి క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారు. మచ్చా దత్త రెడ్డి గత ఏడాది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన అండర్ 19 అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచారు ఆంధ్రా జట్టుకు ఆడుతూ రెండు సెంచరీలతో 500 పరుగులు చేశారు వికెట్ కీపర్ గా 20 కి పైగా క్యాచులు, స్టమ్పింగ్లు సాధించారు దేశంలో హైయెస్ట్ స్ట్రైక్రేటర్ గా మొట్టమొదటి ప్లేయర్ గా ఉన్నారు. హర్యానాతో జరిగిన మ్యాచ్లో 172 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు మళ్ళీ మణిపూర్ రాష్ట్ర జట్టుతో జరిగిన మ్యాచ్లో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు రెండు సెంచరీలు చేసి నాటౌట్ గా నిలిచి ఆకట్టుకున్నారు.

గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్ర జట్టులో ఉంటూ అనేక ఏజ్ గ్రూపులో అద్భుతంగా రాణించారు అంతకుముందు సంవత్సరం కూడా అండర్ 19 అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీల్లో అద్భుతంగా రాణించారు 300కు పైగా పరుగులు సాధించి వికెట్ కీపింగ్ లో 30 క్యాచ్లు స్టాంపింగ్లు చేసి ఎన్.సీ.ఏ నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంప్ కి ఆంధ్ర జట్టు తరఫున ఎంపికయ్యారు. ఈ ఏడాది అండర్ 23 అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీల్లో మొదటి మ్యాచ్ లోనే గోవా జట్టుపై 104 పరుగులు సెంచరీ సాధించి నాటౌట్ గా నిలిచారు అండర్ 23 అంతరాష్ట్ర పోటీల్లో మొదటి మ్యాచ్ సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారు. మచ్చ దత్తారెడ్డి ప్రతిభను గుర్తించిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఆంధ్ర రంజి జట్టుకి ఎంపిక చేసి ప్రోత్సాహాన్ని అందించింది కేరళతో జరిగే ఆంధ్ర రంజీ మ్యాచ్ విజయనగరంలో జరిగే టోర్నమెంట్ కు మచ్చా దత్తారెడ్డిని ఆంధ్ర రంజి జట్టుకి ఎంపిక చేసింది.

ఇప్పటివరకు అన్ని ఏజ్ గ్రూపులలో ఆంధ్ర రాష్ట్ర జట్టుకి ఎంపికై రాణించారు దత్తారెడ్డి అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 19 ఏజ్ గ్రూపులలో ఆంధ్ర రాష్ట్ర జట్టుకి ఎంపికై రాణించారు గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర జట్టుకు ఆడుతూ అద్భుతంగా రాణించారు. అద్భుతంగా రాణించడంతో రంజీ జట్టుకి ఎంపిక అయ్యే అవకాశం వచ్చింది. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ జట్టుకు దత్తారెడ్డి కెప్టెన్ గా వ్యవహరించారు దత్తారెడ్డి క్రికెట్లో అద్భుతంగా రాణించడంతో గుర్తించిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఆంధ్ర సీనియర్ సెలక్షన్ కమిటీ దత్తారెడ్డిని రంజీ జట్టుకి ప్రమోషన్ ఇచ్చి ఎంపిక చేసింది.

ఆంధ్ర జట్టులో అతి చిన్న వయసు కలిగిన క్రికెటర్గా దత్తారెడ్డి జట్టులో చేరనున్నారు మచ్చా దత్తారెడ్డి ఆంధ్ర రంజీ జట్టుకు ఎంపీ కావడం పట్ల ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మ్యాంచో ఫెర్రర్, అనంతపురం జిల్లా క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మధు, ఇతర అసోసియేషన్ సభ్యులు సీనియర్ క్రికెటర్లు మచ్చా దత్తారెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో రాబోవు రోజుల్లో మచ్చా దత్తారెడ్డి రంజీ జట్టుకు ఎంపీక కావడం పట్ల క్రికెట్ అభివృద్ధికి దోహదం పడుతుందని అన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.