కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

  • నేడు కేసీఆర్ పుట్టినరోజు
  • ఓ ప్రకటన ద్వారా విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్
  • కేసీఆర్ కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలంటూ ఆకాంక్ష 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

“తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ తన పోరాట పటిమతో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. నేడు 70వ జన్మదిన వేళ కేసీఆర్ కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.