గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ

  • నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ వెబ్ నోట్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ
  • పేపర్ లీకేజీ కారణంగా 2022 ఏప్రిల్ నాటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు
  • 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్న టీఎస్‌పీఎస్సీ

గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సోమవారం టీఎస్‌పీఎస్సీ వెబ్ నోట్ ఇచ్చింది. 2022 ఏప్రిల్ నెలలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే పేపర్ లీకేజీ కారణంగా కమిషన్ ఒకసారి ప్రిలిమ్స్‌ను రద్దు చేసింది. రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.

సరైన నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు రెండోసారి ప్రిలిమ్స్‌ను రద్దు చేసింది. అదే సమయంలో ఇటీవల మరో 60 గ్రూప్ 1 పోస్టులకు ప్రభుత్వం అంగీకరించింది. పాత 503, కొత్త 60 పోస్టులు… మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు కమిషన్ యోచిస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది.

Leave A Reply

Your email address will not be published.