లోకేశ్ అరెస్ట్ కోసం సీఐడీ పిటిషన్… ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా

  • రెడ్ బుక్ పేరిట అవినీతి అధికారులకు లోకేశ్ హెచ్చరికలు
  • లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించేలా ఉన్నాయన్న సీఐడీ
  • లోకేశ్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ పిటిషన్
  • తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు  

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెడ్ బుక్ పేరిట అవినీతి అధికారులకు హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. సీఐడీ పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు విచారణ చేపట్టింది.

వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లోకేశ్ 41ఏ నిబంధనలు అతిక్రమించారని, అతడి అరెస్ట్ పై వారెంట్ జారీ చేయాలని సీఐడీ  కోరింది. రెడ్ బుక్ అంశంలో లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించేలా ఉన్నాయని ఆరోపించింది.

Leave A Reply

Your email address will not be published.