అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హ‌త్య‌!

  • మృతుడు ప‌రుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా బుర్రిపాలెం
  • బోస్ట‌న్ వ‌ర్సిటీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న అభిజిత్‌
  • యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే హ‌త‌మార్చిన దుండ‌గులు
  • శుక్ర‌వారం రాత్రి స్వ‌స్థలానికి చేరిన‌ అభిజిత్ మృత‌దేహం

అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ప‌రుచూరి అభిజిత్ (20) బోస్ట‌న్ వ‌ర్సిటీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. మార్చి 11న వ‌ర్సిటీ క్యాంపస్‌లోనే గుర్తుతెలియ‌ని దుండ‌గులు అభిజిత్‌ను హ‌త్య చేసి, మృత‌దేహాన్ని కారులో ఉంచి అడ‌విలో వ‌దిలేశారు. స్నేహితుల ఫిర్యాదుతో అత‌డి మొబైల్ ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా పోలీసులు మృత‌దేహాన్ని గుర్తించారు.

అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. శుక్ర‌వారం రాత్రి అభిజిత్ మృత‌దేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌తో బుర్రిపాలెం గ్రామంలో విషాదం అలముకుంది. అభిజిత్‌ విగ‌త‌జీవిగా తిరిగి రావ‌డాన్ని చూసిన త‌ల్లిదండ్రులు చ‌క్ర‌ధ‌ర్, శ్రీల‌క్ష్మీ గుండెల‌విసేలా రోదించారు. అభిజిత్ మృత‌దేహానికి ఇవాళ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Leave A Reply

Your email address will not be published.