హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతను హగ్ చేసుకున్న మహిళా ఏఎస్సై… సస్పెన్షన్

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతను ఆలింగనం చేసుకున్నందుకు సైదాబాద్ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. మాధవీలత తన నియోజకవర్గం పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సైదాబాద్‌లో ఈ ఘటన జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీడియోలో ఉన్నదాని ప్రకారం, ఏఎస్సై మాధవీలతకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత హగ్ చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.