• అక్రమ హోర్డింగ్స్ పెట్టినందుకు భవేశ్‌పై ఇప్పటికే 20సార్లు జరిమానా
  • ఈ ఏడాది ప్రారంభంలో అతనిపై అత్యాచారం కేసు నమోదు
  • అనుమతించిన పరిమాణం కంటే తొమ్మిది రెట్లు ప్రమాదానికి కారణమైన హోర్డింగ్

ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో భారీ వర్షానికి కుప్పకూలిన 100 అడుగుల హోర్డింగ్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హోర్డింగ్ ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదైంది. అయితే అతని గురించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం… అక్రమ హోర్డింగ్స్ పెట్టినందుకు భవేశ్‌పై ఇప్పటికే 20సార్లు జరిమానా పడింది. ఈ ఏడాది ప్రారంభంలో అతనిపై ఒక అత్యాచారం కేసు నమోదైంది. అతను ముందస్తు బెయిల్‌పై బయట ఉన్నాడు. ఇప్పుడు ప్రమాదానికి కారణమైన హోర్డింగ్‌కు ఎలాంటి ముందస్తు అనుమతి లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ హోర్డింగ్ అనుమతించిన గరిష్ఠ పరిమాణం కంటే తొమ్మిది రెట్లు పెద్దగా ఉన్నట్లు తెలిపారు.

నిన్న ములుంద్ ప్రాంతంలోని భవేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతను పరారీలో ఉన్నాడు. భవేశ్ తన కుటుంబంతో కలిసి దేశం దాటాడని… కానీ ముంబై పోలీసులు అతనిని పట్టుకోవడానికి కష్టపడుతున్నారని బీజేపీ నేత కిరిట్ సోమయ్య విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.