- దత్త జయంతి సందర్భంగా బిరుదు ప్రధానం చేసిన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీశ్రీశ్రీ దత్త విజయానందతీర్థ స్వామీజీ
- రూ. లక్ష నగదుతో పాటు జ్ఞాపిక అందజేత
- దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవ చేసిన 21 మందికి బిరుదులు ప్రధానం
అనంతపురం జిల్లాకు చెందిన సంఘ సేవకులు జర్నలిస్టు ఉద్యమ నాయకులు ప్రత్యక్ష దైవం శిరిడి సాయి సినిమా షిరిడి సాయిబాబా పాత్రధారి జర్నలిస్టు, క్రికెటర్ మచ్చా రామలింగారెడ్డికి సనాతన దత్త బంధు బిరుదు వరించింది. గత 30 సంవత్సరాలుగా మచ్చా రామలింగారెడ్డి క్రీడారంగంలో జర్నలిస్టు రంగంలో ఆయన చేసిన సేవలకు ఆధ్యాత్మికం రంగంలో దత్తపీఠంకు చేసిన సేవలను గుర్తించి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఎంపిక చేశారు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవ చేసిన 21 మందికి దత్త జయంతి సందర్భంగా మైసూర్ దత్త పీఠం ఆధ్వర్యంలో సనాతన దత్త బంధు అనే బిరుదు కోసం ఎంపిక చేశారు.

ఇందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రం మైసూరులోని నంజనగూడు రోడ్డులో ఉన్న శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో గురువారం అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగానే మీడియా రంగంలో సనాతన దత్త బంధు బిరుదుకు ఎంపికైన మచ్చా రామలింగారెడ్డికి దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీల చేతుల మీదుగా అవార్డును అందజేశారు. మచ్చా రామలింగారెడ్డికి రూ. లక్ష నగదుతో పాటు జ్ఞాపికను అందజేసి భవిష్యత్తులో క్రీడారంగంలో మీడియా రంగంలో మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డిని స్వామీజీ ఆశీర్వదించారు.
