Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులు హెల్మెట్ ధరించండి: మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్

0 2,040
  • రోడ్డు ప్రమాదాలు నివారమే లక్ష్యం
  • జర్నలిస్టుల ఉచిత హెల్మెట్ పంపిణీ బ్రోచర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జగదీష్
  • వచ్చేవారం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత హెల్మెట్ పంపిణీ
  • మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్

అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాలు జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్టు మీద ఉంది అని జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నదే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు.

అనంతపురం జిల్లా అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రచార పోస్టర్ను జిల్లా ఎస్పీ పి జగదీష్ జిల్లాలోని ట్రైని ఐపీఎస్ అధికారి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ప్రారంభించారు.

జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హెల్మెట్ ధరించాలి రోడ్డు ప్రమాదాలు నివారించాలి అనే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఇది అన్ని వర్గాలకు స్ఫూర్తినిస్తుందని వర్కింగ్ జర్నలిస్టులందరినీ అభినందిస్తున్నానని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని వాటిని తగ్గించాలని లక్ష్యంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నామని ప్రజల నుంచి స్పందన బాగున్నదని అది ఇంకా కొనసాగిస్తామని కొంత పని ఒత్తిడితో కొంత నిదానంగా జరుగుతున్నదని ఎస్పీ జగదీష్ అన్నారు.

జిల్లాలో సరాసరి రోజుకి 40 నుంచి 50 మంది హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని అది లేకుండా చూడాలన్నదే తమ ప్రయత్నమని ఎస్పీ జగదీష్ అన్నారు జిల్లాలోని ప్రజలు యువత అందరూ పోలీస్ శాఖకు సహకరించాలని అందరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని అలా చేసినప్పుడే ప్రమాదాలు నివారించవచ్చునని అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు.

వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేక చొరవ చూపి ఒక్కరు హెల్మెట్ ధరించాలి అని ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్న కార్యక్రమానికి వర్కింగ్ జర్నలిస్టుగా మద్దతు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టు అందరికీ వచ్చేవారం ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జగదీష్ ని వర్కింగ్ జర్నలిస్టులు యూనియన్ గా అభినందిస్తున్నామని ఈ కార్యక్రమానికి వర్కింగ్ జర్నలిస్టుగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాబోవు రోజుల్లో కొనసాగిస్తామని ఎక్కువ జిల్లాల్లో ఉచితంగా హెల్మెట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పంపిణీ చేస్తుందని వచ్చేవారం అనంతపురం జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని అనంతపురం నగరంలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు షాకీర్, వెంకటేష్, రమణారెడ్డి, దాదు నాయక్ జానీ, త్యాగరాజ్త్ ,వెంకట్ , మురళి, ప్రసాద్ పెద్ద ఎత్తున నగరంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ

Leave A Reply

Your email address will not be published.