అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ క్రికెటర్ రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి నీ తుంగభద్ర వారియర్స్ టీంకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల హైదరాబాదులో చెన్నై జట్టు ఇతర టీములతో జరిగిన పోటీలలో అద్భుత ప్రదర్శన చేయడంతో వైస్ కెప్టెన్ గా అవకాశం లభించింది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీ మియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని తుంగభద్ర వారియర్స్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చ దత్తారెడ్డి వైస్ కెప్టెన్ గా ఎన్నికయ్యారు.
మచ్చ దత్త రెడ్డి ఆంధ్ర జట్టుకు అండర్ 14 అండర్ 16 అండర్ 19 అండర్ 23 సీనియర్ రంజి జట్టుకు ఆడిన విషయం తెలిసింది. రాష్ట్రస్థాయి పోటీల్లో అనేక మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు ఈ విషయాన్ని తుంగభద్ర వారియర్స్ జట్టుఅధికారికంగా ప్రకటించింది. ఈనెల 30వ తేదీ వరకు విశాఖపట్నం, కడప, మంగళగిరి ప్రాంతాల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీ ఎల్ క్రికెట్ పోటీలు జరుగుతాయి.