- ఆర్డిటి సేవలు కొనసాగించాలి…
- వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎఫ్ సిఆర్ఏ ను పునరుద్ధరించాలి
- ఆర్డిటి పరిరక్షణ ఫోరం
అనంతపురం మే 3: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ డి టి సంస్థ ఎఫ్సీఆర్ఏ ను పునరుద్ధరించి ఆర్డిటి సేవలు యధాతరంగా కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డిటి పరిరక్షణ ఫోరం కోరింది. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం రాజకీయాలకు అతీతంగా 50 సంఘాలకు పైగా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు ప్రజా సంఘాలు కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఏకతాటిపై ఆర్డిటిని పరిరక్షించుకోవాలని అనంతపురంను కాపాడుకోవాలని ఆర్డిటి పరిరక్షణ ఫోరం గా ఏర్పడ్డారు. ఈ మేరకు సీనియర్ పాత్రికేయులు మచ్చ రామలింగారెడ్డి, అధ్యక్షత వహించారు సమన్వయకర్త సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర వ్యవహరించారు సంఘాలన్ని కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్ టి టి సంస్థ జిల్లాలో స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక కుటుంబాల వారిని పిల్లలను ఉచిత విద్య వైద్యంను అందిస్తూ అలాగే పేద రైతుల కొరకు మహిళల కొరకు వికలాంగుల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం ఆర్డిటి వారి ఎఫ్ సి ఆర్ ఏ ను బ్లాక్ చేయడం వల్ల ఫండ్స్ రాకుండా ఆగిపోయింది. అంతేకాకుండా ఇక్కడ లోకల్గా కూడా ఎఫ్ సి ఆర్ ఏ కు సంబంధించిన అన్నీ ఒక కొలిక్కి వచ్చేవరకు ఆ సంస్థ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కూడా వాడుకోకుండా ఉపయోగించుకున్న కుండా బ్లాక్ చేయించారు. తద్వారా ఆర్టీసీ సంస్థల్లోని సైతం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. అందుకోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ సంస్థను కాపాడుకోవడానికి ప్రజా సంఘాలన్నీ కలిసి కొన్ని తీర్మానాలు చేశారు. సోషల్ మీడియా వేదికగా గల్లి నుండి ఢిల్లీ దాకా చేరేలా ఆర్డిటి పరిరక్షణ అంశాన్ని వ్యక్త పరచడం, జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్ డి టి ని సంరక్షించే కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహించేందుకు సమన్వయకర్తల రూపకల్పన, అనంతపురంలో భారీ ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే విధంగా ర్యాలీ నిర్వహించడం వంటి తీర్మానాలను సమిష్టిగా నిర్ణయించడం జరిగింది.
దాదాపుగా 54 సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.ఈ దినం నుండి దశలవారీగా తీర్మానాల ప్రకారం ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్లి పి ఎం కార్యాలయం ముందు కూడా ధర్నాలు నిర్వహించేందుకు వెనకాడే ప్రసక్తే లేదని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో
డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్, సీనియర్ జర్నలిస్టు సందనం రవికుమార్, ఎమ్మార్పీఎస్ డాక్టర్ కేబి సామ్రాట్ మధు, ఏపీ రైతు సంఘం బి హెచ్ రాయుడు, ఐఎంఎం మహబూబ్ బాషా, తెలుగు వెలుగు టీవీ రెడ్డి, ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ సాకే హరి, ఆశ్రయ అనాధాశ్రయము కృష్ణారెడ్డి, లీగల్ కరెస్పాండెంట్ శ్రీహరి మూర్తి, భూమిపుత్ర దేవి, డెవలప్మెంట్ సొసైటీ పద్మజ, కె.వి.రామన్న, పి ఎస్ ఎఫ్ ఐ స్టేట్ సెక్రెటరీ అబ్దుల్ ఆలాం, లెక్చరర్ రహంతుల్లా, ఫైట్ ఫర్ రైట్స్ కేపీ రాజు, పిఎన్ఐవి అధ్యక్షులు టీ పి రామన్న, సామాజిక న్యాయ ఉద్యమ వేదిక దాసరి ఆదినారాయణ, వంకదార వెంకటకృష్ణ, ఏపీ కౌలు రైతు సంఘం బాల రంగయ్య, ఏఐఎల్ యు డిస్టిక్ ప్రెసిడెంట్ వీరా యాదవ్, ఎస్ ఎస్ బి ఎన్ డిగ్రీ కాలేజ్ డా. ఎన్ రసూల్, రిటైర్డ్ టీచర్ జే రామన్న, జె వి వి ఎస్ తిరుపాలు, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కే అశోక్ నాయక్, బీసీ సంఘం హేమ సుందర్ రాజు, సమాజ క్రాంతి కెరటాలు ఎస్కే లెనిన్ బాబు, అంకుశం విజయరాజు, ప్రజాశక్తి మురళి, సిఐటియు రామాంజనేయులు, జై విజన్ ఫౌండేషన్ నాగమల్లి ఓబులేసు, ఎన్జీవో సెక్రటరీ ఉమామహేశ్వరి, ఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.