- దత్త పీఠం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు
- శ్రీ శ్రీ శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ
- జయలక్ష్మీపురంలో అధునాతన ఉచిత కంటి ఆపరేషన్లు
- శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో వైద్య శిబిరం
ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సేవ ద్వారానే దైవము అనుగ్రహం దొరుకుతుందని ప్రతి ఒక్కరూ సమాజంలో తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ తోడుగా ఉండాలని దత్త పీఠం శ్రీశ్రీశ్రీ విజయానంద తీర్థ స్వామీజీ అన్నారు దత్త పీఠం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాలతో ప్రతి ఒక్క ప్రాంతంలో విద్యా వైద్య ఇతర రంగాల పట్ల శ్రద్ధ చూపుతున్నామని అన్నారు రాప్తాడు మండలంలోని జయలక్ష్మి పురంలో రాబోవు రోజుల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు దత్త క్రియాయోగ కార్యక్రమం కేవలం 500 మందికి మాత్రమే క్రియాయోగ కార్యక్రమం శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నిర్వహిస్తారని అదేవిధంగా అమ్మ జయలక్ష్మి మాత పూజా కార్యక్రమం కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శ్రీశ్రీశ్రీ విజయానంద తీర్థ స్వామీజీ అన్నారు రాప్తాడు మండలంలో జయలక్ష్మి పురం లో ఉన్న క్షేత్రంలో శనివారం ఉదయం ఉచిత కంటి కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన స్వామీజీ ఆపరేషన్ చేసుకున్న ప్రజలకు ఆశీర్వదించారు వారికి అన్ని విధాలుగా దత్త పీఠం ట్రస్టు అండగా ఉంటుందని అన్నారు.

ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీవిజయనంద తీర్థ స్వామీజీ మాట్లాడుతూ…
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జయలక్ష్మీపురం (బొమ్మేపర్తి) గ్రామంలోని జయలక్ష్మీమాత ఆశ్రమంలో పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీల దివ్య ఆశీస్సులతో నిరుపేదలకు, అవసరార్థులకు నిస్వార్థ సేవ అందించే లక్ష్యంతో అధునాతన ఉచిత కంటి వైద్య శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని అన్నారుసామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన జయలక్ష్మీపురం ఆశ్రమంలోని ‘శ్రీ జయలక్ష్మి మాత ఉచిత వైద్యశాల’ అనే నూతన ఆసుపత్రి భవనంలో కంటి ఆపరేషన్ల శిబిరం జరుగుతుంది.
చుట్టుపక్కల ప్రాంతాల పల్లె ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులోకి రావాలనే గణపతి సచ్చిదానంద స్వామీజీ భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించడం జరిగిందని శ్రీశ్రీశ్రీ విజయానందతీర్థ స్వామీజీ అన్నారు గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆదేశాల మేరకు ఎం.ఆర్.చంద్రశేఖర్ కృషితో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చెన్నై శంకర్ నేత్రాలయ, శంకర్ నేత్రాలయ యూఎస్‌ఏ, పుట్టపర్తికి చెందిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ సమన్వయంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గతంలో 2023లో నిర్వహించిన శిబిరంలో సుమారు 1,100 మందికి పైగా పరీక్షలు నిర్వహించి, 230 మందికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈ రెండో భారీ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
జనవరి 16వ తేదీ నుంచి 25 వరకు జరుగుతున్న ప్రస్తుత శిబిరంలో ఇప్పటి వరకు 470 మందికి పైగా బయటి రోగులు పరీక్షలు నిర్వహించగా సుమారు 95 మంది రోగులకు క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సల కోసం ఎంపిక చేయడం జరిగిందని స్వామీజీ అన్నారు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మొబైల్ సర్జికల్ బస్సుల ద్వారా ఈ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల రోగులు అదే రోజున ఆపరేషన్ చేయించుకుని సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునే వెసులుబాటు కల్పించబడింది. అని స్వామీజీ అన్నారుచాలా ఏళ్లుగా నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆశ్రమంలో, ఈ పుణ్య కార్యక్రమ ముగింపు వేడుక అనంతరం దత్త భక్తులకు పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ దివ్య ఆశీస్సులు అందజేశారు కార్యక్రమంలో ప్రత్యక్ష దైవం శిరిడి సాయి సినిమా షిరిడి సాయిబాబా పాత్రధారి మచ్చ రామలింగారెడ్డి స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు జయలక్ష్మి పురం ట్రస్టు సభ్యులు శర్మ కాశీనాథ్ నాయుడు తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ శ్రీ విజయానంద తీర్థస్వామీజీ ఈనెల 29వ తారీకు నుంచి నాలుగు రోజులపాటు అనంతపురం బొమ్మపర్తి జయలక్ష్మి పురం లో మళ్లీ పర్యటించనున్నారు వివిధ కార్యక్రమాలు ప్రారంభోత్సవాల్లో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పాల్గొంటారు