విజయనగరంలో జరుగుతున్న సీనియర్స్ రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్ క్రికెట్ పోటీలలో శనివారం అనంతపురం జిల్లా రంజీ క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆంధ్ర డీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దత్త 70 పరుగులు సాధించారు. మూడు సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలు ఈనెల 31 వరకు కొనసాగనున్నాయి. ప్రతీ మ్యాచ్ 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు.