Take a fresh look at your lifestyle.

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపిన కోర్టు

0 121

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపులకు సంబంధించి నమోదైన కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 7 వరకు పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపుతూ బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది.

పీఎస్‌ఆర్ ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు బుధవారం ఉదయం థర్డ్ ఏసీజేఎమ్‌ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఛాంబర్‌లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట లాయర్‌తో కలిసి పీఎస్ఆర్ స్వయంగా వాదనలు వినిపించారు. జెత్వానీ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని వాదించారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తనకూ ఈ కేసుకు సంబంధం లేదని పీఎస్‌ఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.