అనంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి బుధవారం సంచలన రికార్డు సృష్టించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన వివిధ పోటీల్లో ఏకంగా 104 సిక్సర్లు బాదారు. ఈ సీజన్‌లో ఇప్పటికే 1499 పరుగులు సాధించిన దత్తారెడ్డి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నారు. ఒకే సీజన్‌లో 104 సిక్సర్లు కొట్టి ఆంధ్ర క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు.