Take a fresh look at your lifestyle.

పుట్టపర్తి పట్టణంలో RDT బాలుర క్రికెట్ సెలక్షన్స్ సెప్టెంబర్ 25 న ప్రారంభం

0 7

ఆసక్తి గల చిన్నారులు యువ క్రికెటర్లు పాల్గొనండి

శ్రీ సత్య సాయి జిల్లాలోని పుట్టపర్తి పట్టణంలో గల రామ్ లక్ష్మణ్ క్రీడా మైదానం నందు బాలుర యువ క్రికెట్ సెలక్షన్స్ సెప్టెంబర్ 25తారీఖున ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది బాలుర క్రికెట్అండర్ 15 అండర్ 18 రెండు గ్రూపులుగా సెలక్షన్లు జరుగును

రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ RDT ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని ప్రతిభ ఉన్న గ్రామీణ మహిళా క్రికెటర్లను గుర్తించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆర్డిటి రూరల్ క్రికెట్ టాలెంట్ పేరుతో జిల్లా వ్యాప్తంగా చిన్నారులు బాలుర క్రికెట్ సెలక్షన్లు నిర్వహించడం జరుగుతున్నది ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రవీణ్ కోఆర్డినేటర్ గ్రాస్ రూట్ లెవెల్ ఆర్డిటి ప్రతినిధి ప్రదీప్ ప్రవీణ్ కుమార్ రెడ్డి షాకీర్ తదితరులు పాల్గొని పర్యవేక్షించి ఎంపిక చేస్తారు

పుట్టపర్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలు గ్రామాల్లో ఉన్న ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నారులు బాలుర క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్లు స్కూళ్లు కాలేజీలు ఇతర సంస్థల్లో ఆడుతున్న యువ బాలుర క్రికెటర్లందరూ ఈ ఎంపికలో పాల్గొనవచ్చును 15 సంవత్సరాల లోపు ఉన్న యువ క్రికెటర్లు 18 సంవత్సరాలు లోపు ఉన్న యువ క్రికెటర్లు ఈ ఎంపికలో పాల్గొనవచ్చును ఎంపికలో పాల్గొనాలని ఆసక్తి గలవారువైట్ డ్రెస్సు షూస్ యూనిఫామ్ తో తప్పకుండా రావాలి సొంత క్రికెట్ కిట్టు తో హాజరు కావలసి ఉంటుంది

ఆసక్తి గల వారు సెలక్షన్లు జరిగే ప్రాంతంలోనేరుగా మైదానంకు వచ్చి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చును

Leave A Reply

Your email address will not be published.