- నేడు అనంత క్రీడా గ్రామంలో ప్రారంభమైన టాలెంట్ హంట్ రెండో దశ..
- మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి క్రీడాకారుల హాజరు
- మచ్చా రామలింగారెడ్డి, చైర్మన్ క్రికెట్ డెవలప్మెంట్ ఆర్డిటి
అనంతపురం: అనంతపురం జిల్లాలో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతోగ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) మంచో ఫెర్రర్ ప్రత్యేక చొరవ చూపి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని యువ క్రికెటర్లందరూ ఉపయోగించుకోవాలని మచ్చా రామలింగారెడ్డి చైర్మన్ ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టాలెంట్ హంట్ రెండో దశ నేడు ఆర్డిటి క్రీడా మైదానంలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ రెండో దశలో భాగంగా మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు 91 మంది పాల్గొన్నారు.

క్రీడాకారుల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలను ఎంపిక కమిటీ సభ్యులు, కోచ్‌లు పరిశీలించి మూడోదశ సెలక్షన్‌కు ఎంపిక చేస్తారని తెలిపారు ప్రతిభను గుర్తించి సరైన శిక్షణ అందించడం ద్వారా భవిష్యత్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దడమే టాలెంట్ హంట్ ప్రధాన ఉద్దేశమని మచ్చ రామలింగారెడ్డి అన్నారు.
రెండో దశలో ఎంపికైన ప్రతిభావంతులకు తదుపరి శిక్షణ, ఎంపిక ప్రక్రియలో అవకాశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కోఆర్డినేటర్ ప్రవీణ్, సెలెక్టర్లు ప్రదీప్, విజయరాజు, యోగానంద కోచ్ లు ఎస్.ఎల్.ఎన్ ప్రసాద్, హరినాథ్ రెడ్డి, మోహన్, రాజశేఖర్,, విజయ్, సల్మాన్ పాల్గొన్నారు.