Take a fresh look at your lifestyle.

క్రీడలకు మంచో ఫెర్రర్ ఒక వరం: ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు

0 19,878
  • క్రికెట్ లో రాణించి పేరు ప్రఖ్యాతులు తీసుకురండి
  • రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్స్ కు భారీ స్పందన
  • రాయదుర్గంలో RDT క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు

కరువు నేల అనంతపురం జిల్లాకు ఆర్డిటి మంచు ఫెర్రర్ క్రీడలకు ఒక వరం లాంటివారు అని గ్రామీణ ప్రాంతాల్లో యువ క్రికెటర్లు క్రీడాకారులను గుర్తించేందుకు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనంతపురంలో నిర్మించారని ఆర్డిటిని అభినందిస్తున్నానని క్రికెట్లో రాణించి జిల్లాకు రాష్ట్రానికి ఎంపికై పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనిప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాస్ సూచించారు రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానం నందు ఆర్డిటి ఆధ్వర్యంలో రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సభకు మచ్చా రామలింగారెడ్డి చైర్మన్ ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సెలక్షన్ కమిటీ సభ్యులు యుగంధర్ ప్రదీప్ ప్రవీణ్ కుమార్ షాకీర్ ఆర్డిటి కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ ఆర్డిటి ఎటి ఎల్ స్కూల్ హెడ్మాస్టర్ కోచ్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభాధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్లు నిర్వహిస్తున్నామని దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తించాలన్న లక్ష్యంతో ఆర్డిటి ఆధ్వర్యంలో రూరల్ క్రికెట్ టాలెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి అక్కడ ప్రతిభ ఉన్న గ్రామీణ క్రికెటర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందని మచ్చ రామలింగారెడ్డి వివరించారు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ మచ్చ రామలింగారెడ్డి తనకు ఎన్నో సంవత్సరాలుగా 35 సంవత్సరాల కు పైగా తెలుసునని క్రికెట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఎందరో క్రికెటర్లను తయారు చేశారని మహిళా క్రికెట్ ను రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో ప్రారంభించిన చరిత్ర మచ్చ రామలింగారెడ్డి ది అని అటువంటి వారి నాయకత్వంలో రాయదుర్గంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం అని కాల్వ శ్రీనివాస్ అన్నారు.

 

రాయదుర్గం లాంటి ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా నిర్వహించినందుకు ఆర్డిటి సంస్థని అభినందిస్తున్నానని క్రికెట్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఇక్కడ ప్రతిభ ఉన్న క్రికెటర్లను ఎంపిక చేసి వారికి ఉత్తమ శిక్షణ ఇవ్వడం ఒక శుభ పరిణామం అని కాలువ శ్రీనివాసులు అన్నారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కాలువ శ్రీనివాసులు సూచించారు రాయదుర్గం ప్రాంతంలో ప్రతి ఏడాది మేము క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంటామని ఇటువంటి సెలక్షన్లు రాయదుర్గంలో నిర్వహించడంతో రాబోవు రోజుల్లో ఇక్కడ కూడా జిల్లాను స్థాయి క్రికెటర్లు రాష్ట్రస్థాయి క్రికెటర్లు తయారయ్యే అవకాశం ఉందని అందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని కాలువ శ్రీనివాసులు హామీ ఇచ్చారు సమావేశం అనంతరం కాలువ శ్రీనివాసులు ను మచ్చ రామలింగారెడ్డి ఘనంగా సన్మానించారు అనంతరం కాల్వ శ్రీనివాసులు క్రికెటర్లను పరిచయం చేసుకొని బ్యాటింగ్ చేసి లాంఛనంగా క్రికెట్ సెలక్షన్ ప్రారంభించారు

Leave A Reply

Your email address will not be published.