- అనంతలో ముగిసిన ఆర్డిటి రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ రెండవ దశ అండర్ 15 కార్యక్రమం
- జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైగా హాజరు క్రికెట్ చరిత్రలో రికార్డు: మచ్చా రామలింగారెడ్డి
- చైర్మన్ ఆర్.డీ.టి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ
అనంతపురం, అక్టోబర్ 27: యువ క్రికెటర్లు రాబోవు రోజుల్లో క్రికెట్ లో రాణించి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయికి ఎదిగి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆర్డిటి సంస్థ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్క యువ క్రికెటర్ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లాలో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఆర్డిటి రూరల్ క్రికెట్ టాలెంట్ కార్యక్రమం జరుగుతున్నదని మచ్చా రామలింగారెడ్డి చైర్మన్ ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ అన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని 14 కేంద్రాలలో ఆర్డిటి నిర్వహించిన రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ లో రెండవ దశలో అండర్ 15 విభాగంలో 500 మందికి పైగా క్రికెటర్లు పాల్గొన్నారు వారి ప్రతిభని సెలెక్టర్లు గమనించారని అంతకుముందు నిర్వహించిన మొదటి విడతలో రెండు వేల మంది పైగా యువ క్రికెటర్లు పాల్గొనడం జిల్లా క్రికెట్ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని భవిష్యత్తులో జిల్లాలో యువ క్రికెటర్లకు కొరత లేదని ఈ కార్యక్రమం నిరూపించిందని రాబోవు రోజుల్లో క్రికెట్లో రాణించి జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి జాతీయస్థాయి రంజీ క్రీడాకారులు కావాలన్నదే ఆర్డిటి మంచో ఫెర్రర్ లక్ష్యం అని అందుకోసం జిల్లాలో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను గుర్తించే కార్యక్రమాన్ని మంచో ఫెర్రర్ గారు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జిల్లాలోని యువ క్రికెటర్లందరూ ఉపయోగించుకున్నారని ఇది ఒక మంచి శుభ పరిణామం అని మచ్చా రామలింగారెడ్డి చైర్మన్ ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ అన్నారు అనంతపురం నగరంలోని ఆర్డిటి క్రీడా గ్రామంలోని క్రీడా మైదానం నందు ఆర్డిటి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ప్రతిభాన్వేషణ ఎంపికలను నిర్వహించింది.

రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ రెండవ దశ అండర్ 15 కార్యక్రమం ముగిసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఆర్డిటి క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి, సెలెక్టర్లు యోగానంద , విజయ్ రాజు, రాజేశ్వరి, హరినాథ్ రెడ్డి, రఫీ రాజశేఖర్ ఈనాయతుల్లా ఆర్డిటి గ్రాస్రూట్స్ కోఆర్డినేటర్ కె.ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి యువ క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఆర్డిటి ఈ నూతన చొరవ తీసుకుందని, ప్రతిభాన్వేషణ కోసం అనంతపురం నగరంలోని చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి యువ క్రీడాకారులు సమావేశమవడం ఆనందంగా ఉందని, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి కోచింగ్ శిబిరాలకు పంపుతాము అని తెలిపారు.
అనంతపురం నుంచి ప్రతిభ ఉన్న ఎందరో క్రికెటర్లు ఆర్డిటి స్టేడియం ను ఉపయోగించుకొని రంజీ ట్రోఫీ ఆటగాళ్లు కాగలిగారని, టాలెంట్ హంట్ ఎంపికల ద్వారా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తిస్తున్నామని, గ్రామీణ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు సరైన క్రికెట్ సౌకర్యాలను వినియోగించుకునేలా చూడటానికి మాజీ భారత, ఆంధ్ర ఆటగాళ్లతో కలిసి NCA, రాష్ట్ర జట్ల శిబిరాల వంటి శిబిరాలను నిర్వహించాలనుకుంటున్నామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించి, వారికి మరింత శిక్షణ ఇవ్వడమే మోంచో ఫెర్రర్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి క్రికెట్ కోచ్లు అనంతపురం ఆర్ డి టి కోచ్ ఇనైతుల్లా రఫీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో మొత్తం 90 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.