- హైదరాబాద్ జట్టుపై అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన
- 5 సిక్సర్లు 6 ఫోర్లతో 86 పరుగులు సాధించారు
- హైదరాబాదులో జరుగుతున్న సీనియర్స్ ఎమర్జింగ్ ప్రీమియర్ లీగ్ పోటీలలో
తెలంగాణ రాజధాని హైదరాబాదు లో ఆంధ్ర హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న సీనియర్స్ ఎమర్జింగ్ ప్రీమియర్ లీగ్ డేస్ క్రికెట్ మ్యాచ్ లో ఆంధ్ర సీనియర్స్ ఏ జట్టుకు ఎంపికైన అనంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో సీనియర్ జట్టులో ఆకట్టుకున్నారు.
హైదరాబాద్ తో పబ్లిక్ స్కూల్ నందు జరుగుతున్న మ్యాచ్లో బుధవారం ఈరోజు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసి సెంచరీ మిస్ చేసుకున్నారు 89 బంతుల్లో 86 పరుగులు చేశారు అందులో 6 ఫోర్లు 5 సిక్సర్లు కొట్టారు అర్థ సెంచరీ సాధించారు మచ్చా దత్త రెడ్డి అద్భుత బ్యాటింగ్ ప్రతిభతో గ్రౌండ్ నలుమూలల సిక్సర్లు ఫోర్లు తో ఆకట్టుకున్నారు. ఆంధ్ర సీనియర్స్ ఏ జట్టు 2 వికెట్లు కోల్పోయి 290 పరుగులు లంచ్ సమయానికి స్కోర్ సాధించింది
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర సీనియర్స్ ఏ జట్టు హైదరాబాద్ సీనియర్స్ ఎమర్జింగ్ ప్రీమియర్ లీగ్ పోటీలుజట్ల మధ్య గత 20 రోజులుగా హైదరాబాదులో పబ్లిక్ స్కూల్ నందు మ్యాచులు నిర్వహించడం జరుగుతున్నది ఇందులో అనంతపురం జిల్లాకు చెందిన మచ్చ దత్తారెడ్డి రాణించి ఆకట్టుకున్నారు మూడు నాలుగు రోజుల పోటీలు మ్యాచులు, 5 టీ20 క్రికెట్ పోటీలు ఆంధ్ర హైదరాబాద్ జట్లు మధ్య వచ్చే నెల 5 వరకు హైదరాబాదులో నిర్వహిస్తున్నారు.